ప్రకృతి వ్యవసాయం

వ్యవసాయ పరంగా మనం ముందుకు వెళుతున్నామా వెనక్కి వెళుతున్నామా అనే విషయంపై మనం దృష్టిపెట్టాల్సిందే. విషాహారం విజృంభిస్తున్న నేటి కాలం నుంచి వెనక్కి వెళితేనే మనకు చక్కటి పరిష్కారమార్గం లభిస్తుంది. అదే ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి ప్రేమికుడు, పచ్చదనం ప్రేమికుడు, పంటలకు రసాయిన ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండా ఆరోగ్య కరమైన అధిక ఉత్పత్తి సాదించిన ఘనుడు, సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్. ఈయన అభివృద్ధి పరచిన వ్యవసాయ పద్దతికి పాలేకర్ విధానంగా పేరు.
ఒక్క ఆవుతో 30 ఎకరాల సాగు
ఒక్క దేశ వాళీ ఆవుతో సుమారు 30 ఎకరాలలో మిశ్రమ పంటలను పండించ వచ్చని అంటారు వీరు. దేశ వాళీ ఆవు పేడ, మూత్రం పంటలకు ఎంతో ముఖ్యమని అంటారు. ఇతర జంతువుల పేడ, మూత్రం దేశ వాళీ ఆవు పేడ, మూత్రం ఇచ్చినంత ఫలితాన్నివ్వవని ఈయన నమ్ముతారు.ప్రకృతి వ్యవసాయ పద్దతులకు కావలసిని సలహాలనిస్తారు. ఈ విషయంలో కొంత మంది కలసి ఎక్కడిరమ్మాన్నా వస్తారు. వారిటి తగు సలహాలను, సూచనలను ఇస్తారు. దేశ వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది రైతులు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. నెలకు ఇరవై రోజులు ప్రయాణలలో, అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్న సదస్సులతోనే సరిపోతుంది. సాగులో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడడం వల్ల రోగాల పాలవుతున్నామని చెప్పారు. రసాయనిక సాగుతో వచ్చిన పంటల్లో కూడా రసాయనిక అవశేషాలు ఉంటాయన్నారు. ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయని చెప్పారు. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమన్నారు.దేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా హైదరాబాదులో ప్రత్యేక కార్యాలయం ఉంది. దీని పోన్ నెంబర్లు 040 27635867, 27654336. ప్రకృతి సేద్యం చేయాలనుకునేవారికి ఒక ఎకరానికి సరిపడా విత్తనాలను ఉచితంగా ఇస్తామంటున్నారు ఈ కార్యాలయం వారు. విద్యావంతులైన ఇతని కుమారులు ఇద్దరూ తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి తమ తండ్రి బాటలోనే ప్రయాణిస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు.పాలేకర్ ప్రకృతిసేద్యం పద్దతికి ఆకర్షితులైన రైతులు ఆ విధానలో వ్యవసాయం చేస్తున్నారు. అలా వ్యవసాయ దారులుగా మారిన వారిలో, వ్యాపార వేత్తలు, విద్యాధికులు. సాప్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఈ విధానంలో వ్యవసాయం చేస్తున్న వారు మన రాష్ట్రంలో సుమారు 50,000 మంది ఉన్నట్లు ఒక అంచనా.
ఈ వ్యవసాయంలోకి ఎలా మారాలి?
పెట్టుబడి లేని వ్యవసాయం వెంటనే మొదలుపెట్టరాదు. 3, 4 సంవత్సరాలపాటూ రసాయనాల వాడకం తగ్గిస్తూ జీవామృతం వాడకం పెంచుతూ ఉండాలి. భూమిలో రసాయన ఎరువులు, కలుపు మందుల అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోవాలంటే సుమారు 3 నుండి 4 సంవత్సరాలు పడుతుంది. తొలుత మూడు, నాలుగు సంవత్సరాలు దిగుబడులు, ఆదాయాలు ఆశించిన రీతిలో రాకపోవచ్చు. తర్వాత సంవత్సరాల నుంచి తీసుకున్న శ్రద్ధను బట్టి అధిక దిగుబడులు, అధిక లాభాలు వస్తాయి.జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయి. జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరం. మెట్ట పొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే, భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పింవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదు. దేశీ లేదా నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ద్రవ జీవామృతం పంటకు బలాన్ని ఇస్తుంది. ఈ జీవామృతాన్ని ద్రవ ,ఘన రూపాలలో తయారు చేసుకోవచ్చు .

Comments are closed.

వీడియో-డయా రైస్ వివరాలు


వీడియో-జీవామృతం తయారీ


వీడియో-సేంద్రియ వ్యవసాయం