ఆవు మూత్రంతో అమృత తుల్య ఆహారం

మనం కామధేనువుగా పూజించే ఆవు మన ఆరోగ్యాన్ని కాపాడంలో అమ్మకంటే ఎక్కువ పాత్ర పోషిస్తోంది. అవుతో సాగు చేస్తే అంతకుమించిన ఫలసాయం మనకు మరొకటి ఉండదు. రసాయనిక ఎరువులు, టన్నుల కొద్దీ వేస్తున్న పశువుల ఎరువులతోనే కలుపు రైతులకు తీవ్ర సమస్యగా మారుతోంది. సక్రమంగా ఆచ్ఛాదన కల్పించి, జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయి. జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరం. మెట్ట పొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పించవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదు. నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవులుంటాయి. కర్నాటక, కేరళ ప్రభుత్వాలు ఈ విధానాన్ని ఆమోదించి శిక్షణాశిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలో పది లక్షల మంది ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయంలో మన దేశీయ గోవులది ప్రధాన పాత్ర. దేశీ ఆవుల మూత్రంలో , పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములున్నాయి , కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు. 1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ రుజువు చేశారు . జెర్శీ ఆవుకు , దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయి. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు, హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. పాల విషయంలో కూడా జెర్సీకి , దేశీ అవుకు చాలా తేడాలున్నాయి. జెర్సీ ఆవు పాలలో ” A 1 బీటా కేసిన్ ” అనే కాన్సర్ కారక ఫ్రొటీను ఉంటుంది , దేశీ ఆవు పాలలో ” A 2 బీటా కేసిన్ ” అనే ఔషద ప్రొటీను ఉంటుందని పరిశోధనల్లో తేలింది. విదేశీయులు మనకు జెర్శీ ఆవులను అంటగట్టి వారు మత్రం మన దేశీ ఆవుల ద్వారా లభించే A 2 పాలను సేవిస్తున్నారు . జెర్సీ ఆవు ( శాస్త్రీయ నామం : బాస్ టారస్ ) జన్యు క్రమములో , దేశీ ఆవు ( శాస్త్రీయ నామం : బాస్ ఇండికస్ ) జన్యు క్రమంలో తేడాలున్న కారణంగానే అది దేశీ ఆవుతో సమానం కాదు . అందువల్ల మన దేశీ ఆవులను కాపాడవలసిందే.
బ్రెజిల్ లో మన దేశీ ఆవుల ద్వారా లభించిన ” బ్రాహ్మిణ్ ” జాతి ఆవుల ద్వారా రోజుకు 40 లీటర్ల ఆరోగ్యకరమైన A2 పాలను పొందుతున్నారు . మన దేశీ ఆవులు ఎలాంటి కరవు పరిస్థితులనైనా తట్టుకొంటాయి. పాలను పొందడానికి “ఆక్సిటోసిన్” లాంటి హానికారక హార్మోనులను ఎక్కించాల్సిన పనిలేదు. రోగ క్రిమి నాశక మందులను ప్రతి నెలా ఇవ్వనవసరం లేదు. శీతలీకరణ పరికరాలను అమర్చాల్సిన పనిలేదు . మన దేశీ ఆవులను పెంచడం చాలా సులభం. దేశీ ఆవులలోని కొన్ని జాతులను సంకరపరిచి ఎక్కువ పాలిచ్చే జాతిని పెంపొందించవచ్చు. ఇలా చేయడం వల్ల మన రైతులు మన దేశీ ఆవుల పెంపకంపై ఆసక్తి చూపి వాటిని పెంచి లాభం పొందుతారు.

Comments are closed.

వీడియో-డయా రైస్ వివరాలు


వీడియో-జీవామృతం తయారీ


వీడియో-సేంద్రియ వ్యవసాయం