డయా రైస్‌ వచ్చేసింది

మధుమేహ రోగులకు ఈ తాజా వరి విత్తనం వరమేనని చెప్పాలి. మధుమేహ రోగులు ఇప్పటిదాకా అన్నం తక్కువ తినడం, రాత్రుళ్లు గోధుమ రొట్టెలకు ప్రాధాన్యమివ్వడం చేస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఓ కొత్త వరివంగడాన్ని సృష్టించారు. దీనికి ఆర్‌.ఎన్‌.ఆర్‌.15048గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ డయారైస్‌ పరిశోధనల దశలో ఉంది. మనం సన్నబియ్యంగా పిలిచే సాంబా మసూరి కన్నా ఈ డయారైస్‌ గింజ మరింత సన్నగా జీలకర్ర మాదిరిగా ఉంటుంది. ఇందులో పిండిపదార్థాల శాతం బాగా తక్కువ కాబట్టి దీన్ని డయాబెటిక్‌ రైస్‌గా వ్యవహరిస్తున్నారు. దీని గైసీమిక్‌ ఇండెక్స్‌ 51 శాతం ఉంది. సాధారణంగా 55 శాతం గైసీమిక్‌ ఇండెక్స్‌ వరకు మధుమేహ రోగులకు పనికొస్తుంది. వచ్చే సంవత్సరంలో ఈ బియ్యం అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఈ బియ్యం కావాలనుకున్నా, విత్తనాలు కావాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు.

Comments are closed.

వీడియో-డయా రైస్ వివరాలు


వీడియో-జీవామృతం తయారీ


వీడియో-సేంద్రియ వ్యవసాయం