జీవామృతం తయారీ ఎలా?

కావలసిన పదార్ధములు
ఒక ఎకరం పంట పొలానికి సరిపడా జీవామృతం తయారీకి కావలసిన పదార్ధాలు
డ్రమ్ము – నీళ్ళు పట్టేది
నీళ్ళు – 200 లీటర్లు(సుమారుగా 15 బిందెలు),
ఆవు పేడ-10 కిలోలు,
ఆవుమూత్రం-10 లీటర్లు,
పప్పు దినుసుల పిండి-2 కిలోలు,
బెల్లం-2 కిలోలు,
గట్టు మట్టి-గుప్పెడు.
తయారు చేసే విధానం
మొదట డ్రమ్ములో 200 లీటర్ల(సుమారుగా 15 బిందెలు) నీటిని తీసుకొని దానిలో 10లీటర్ల ఆవుమూత్రం తీసుకోవాలి. 10 కేజీల ఆవు పేడను డ్రములో కలుపుకోవాలి. 2 కేజీలు పప్పు దినుసుల పిండిని కలుపుకోవాలి. 2 కేజీల బెల్లం వీటితో పాటు కలుపుకోవాలి. గట్టుమట్టిని గుప్పెడు కలుపుకోవాలి. ఈ అన్ని కలుపుకున్న మిశ్రమాన్ని కర్రతో బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. దీనిని నాలుగు రోజులు మురగనివ్వాలి. దీనిని నాలుగు రోజులు రోజుకు మూడుసార్లు ఉదయం, మధ్యానం, సాయంత్రం కర్రతో కలుపుకోవాలి. నాలుగు రోజులు మురిగిన తర్వాత పంటకు వాడుకోవచ్చు. ఈ విధంగా చేయటం వలన లాబాలు పంటకు బలాన్నిస్తుంది. దీనిని తయారు చేయుటప్పుడు ముందు జాగ్రత్తచర్యలుగా ఆరోగ్యకరమయిన దేశీయ ఆవు పేడ, ఆవు మూత్రం తీసుకోవాలి. దీనిలో ఏమీ కలుపకూడదు. ఈ విధంగానే వాడుకోవాలి. మనం పంటకు నీరు పెట్టె కాల్వ దగ్గర లేదా పంటలో దీనిని పోసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమం ఒక ఎకరా కు పనిచేస్తుంది.
బెల్లపు మడ్డి ఉపయోగించి జీవామృతం తయారుచేసే విధానం:
బెల్లం తయారు చేసేటప్పుడు వ్యర్ధంగా మిగిలే పదార్ధాన్నే బెల్లపు మడ్డి అని అంటారు బెల్లపు మడ్డిని ఉపయోగించి జీవామృతం తయారు చేసేటప్పుడు బెల్లానికి బదులుగా 4 లీటర్ల బెల్లపు మడ్డిని ఉపయోగిస్తాం. మంచి నీరు ,ఆవు మూత్రం,ఆవు పేడ ,పప్పు ధాన్యాల పిండి,పొలంమట్టి అన్నీ జీవామృతం తయారీలో ఎంత నిష్పత్తిలో వాడుతామో ,అంతే నిష్పత్తిలో ఉపయోగిస్తాం.
జీవామృతం పిచికారి చేసే పధ్ధతి
3 నెలల్లో (60 నుంచి 90 రోజుల్లో ) పూర్తయ్యే పంటలకు ఎకరానికి
మొదటిసారి : (విత్తనం నాటిన 1 నెలకి ) 5 లీటర్ల జీవామృతం ,100 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .
రెండో సారి : (మొదటి సారి పిచికారి చేసిన 21 రోజుల తర్వాత ) 10 లీటర్ల జీవామృతం,150 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .
మూడో సారి : (రెండో సారి పిచికారి చేసిన 21 రోజుల తర్వాత )20 లీటర్ల జీవామృతం,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .
నాలుగో సారి : (గింజ ఏర్పడే టప్పుడు -మిల్కింగ్ స్టేజి )5 లీటర్ల మజ్జిగ ,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .చివరి సారి జీవామృతం అవసరం లేదు .

Comments are closed.

వీడియో-డయా రైస్ వివరాలు


వీడియో-జీవామృతం తయారీ


వీడియో-సేంద్రియ వ్యవసాయం