మా గురించి

ఆరోగ్యవంతమైన సమాజానికి అంకురార్పణ చేసే దిశగా అడుగులు వేయాలన్నది మా సంకల్పం. ఉదయం మనం తాగే పాల దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే ముందు తాగే నీటి వరకు అంతా కల్తీ మయమే. బియ్యం, పప్పులు, ఉప్పులు… ఇలా అన్నిటిలోనూ విష రసాయనాలు ఉంటున్నాయి. ఫలితంగా మనిషి రోగాల బారినపడి విలవిలలాడుతున్నాడు. ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసుకోవడమే కాకుండా చివరికి ప్రాణాలు కోల్పోతున్నాడు. ఈ పరిస్థితి మారాలంటే మనం తీసుకునే ఆహారం విషరహితమై ఉండాలి. అలాంటి ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయా అంటే లేదు అనే సమాధానమే వస్తోంది. ఆర్గానిక్‌ ఉత్పత్తుల పేరిట లభ్యమయ్యేవాటిలో ఎంతవరకు శుద్ధత ఉందో మనకు తెలియదు. పైగా వాటి ధరలు చూస్తే గుండె గుభేలుమంటోంది. పాలేకర్‌ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులు చాలా అరుదుగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే రైతుల్లో ఈ చైతన్యం వస్తోంది. పాలేకర్‌ సూచించే వ్యవసాయ విధానం వల్ల రైతు సాగు ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది. ఇలాంటి సాగు చేసే వారందిరినీ ఒక వేదిక మీదకు తీసుకురావడం, ఈ ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా ‘గోరైస్‌ డాట్‌ ఇన్‌’ పనిచేస్తుంది. ఆధ్యాత్మిక వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం పేరుతో పిలిచే ఈ సాగు పద్ధతుల్ని రైతులకు పరిచయం చేయడం, రసాయన రహిత సమాజం దిశగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కూడా మా లక్ష్యంలో భాగమే.

వీడియో-డయా రైస్ వివరాలు


వీడియో-జీవామృతం తయారీ


వీడియో-సేంద్రియ వ్యవసాయం